Home » High Court
విద్యుత్ స్తంభాలపై అమర్చిన ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనుమతి లేని కేబుల్ వైర్లను తొలగించాలని స్పష్టం చేసింది.
భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ చిన్న కారణాలతోనే అర్థం చేసుకోలేక విడిపోయిన జంటలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి సంఘటనపై కోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు విధానం (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్-ఎ్‌ఫఆర్‌ఎస్) శనివారం ప్రారంభమైంది.
హుక్కా కేంద్రాలపై దాడులు చేసి కేసులతో వదిలేస్తున్నారా? వినియోగదార్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
శబరిమలకు వచ్చే భక్తుల భద్రత ముఖ్యమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వేర్వేరు తీర్పుల్లో.. విద్యుదాఘాతం వంటి ఘటనలు జరగకుండా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)లను ఆదేశించింది.
స్వదేశంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, వేరే దేశాన్ని పొగిడినంత మాత్రాన అది నేరం కిందికి రాదని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తీర్పు ఇచ్చినందుకు జస్టిస్ మౌషమీ భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిర్యాదుదారు ఎన్. పెద్దిరాజు, ఆయన న్యాయవాదులు ఇద్దరు హైకోర్టుకు క్షమాపణ తెలియజేశారు.
నెట్వర్క్ కేబుల్ వైర్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రామంతాపూర్ ఘటన తర్వాత హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్టెల్ సంస్థ కోరింది. అయితే, ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.