High Court: సహాయక చర్యల వివరాలివ్వండి: హైకోర్టు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:17 AM
రాష్ట్రంలో భారీ వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారో వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారో వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, విపత్తుల సమయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తాజా పరిస్థితులపై అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పుడే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ధర్మాసనం.. విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.