Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:30 AM
ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు. అయితే, నిన్న విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం అదే బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్ వేసి విచారణ జరపాలని కోరారు.
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం నాడు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, నిన్న విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ (సోమవారం) అదే బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్ వేసి విచారణ జరపాలని కోరారు. కోర్టు లంచ్ మోషన్‌కు కూడా స్వీకరించలేదు.
రెగ్యులర్ పిటిషన్లలాగే ఆ పిటిషన్‌ను కూడా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేస్తామని పేర్కొంది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేమని, సీబీఐ విచారణ ఆపాలనీ ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా హైకోర్టులో కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం మాట్లాడుతూ.. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చీఫ్ జస్టిస్ ముందు ప్రస్తావించారు. ఇద్దరినీ ఉరి తీయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీలో నిర్ణయం జరిగినట్లు వెల్లడించారు. అందుకే అర్జెంట్‌గా పిటిషన్‌ను విచారించాలని కోరుతున్నామన్నారు. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
కాగా, మంగళవారం నాడు ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనల్ని ధర్మాసనానికి వినిపించనున్నారు. వాదనల అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల జుట్టు మీద ప్రభావం ఉంటుందా?