Share News

High Court: కోడిగుడ్ల టెండర్‌పై పిటిషన్‌ డిస్మిస్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:13 AM

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, ప్రభుత్వ గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా కోసం జారీ చేసిన టెండర్లకు హైకోర్టులో మార్గం సుగమమైంది.

High Court: కోడిగుడ్ల టెండర్‌పై పిటిషన్‌ డిస్మిస్‌

  • కేసు పెట్టిన సిరి ఫామ్స్‌కు హైకోర్టు రూ.లక్ష జరిమానా

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, ప్రభుత్వ గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా కోసం జారీ చేసిన టెండర్లకు హైకోర్టులో మార్గం సుగమమైంది. ఈ టెండర్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు పిటిషనర్‌ అయిన సిరి ఫామ్స్‌పై రూ.లక్ష జరిమానా విధించింది. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు గురుకులాలు, కేజీబీవీలు, వసతి గృ హాలకు కలిపి టెండర్లు నిర్వహించుకోవాలని ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.


అయితే హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించిన టెండర్‌ను ఎంఏ పౌలీ్ట్ర అండ్‌ ఫీడ్‌కు అనుకూలంగా ఖరారు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన సిరి ఫామ్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని టెండర్‌ పొందిన ఎంఏ పౌలీ్ట్ర అండ్‌ ఫీడ్‌ సంస్థ వాదించింది. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Updated Date - Aug 30 , 2025 | 02:13 AM