Home » Hero Vijay
తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే నేత, హీరో విజయ్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఇటీవల తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ర్యాలీలకు వస్తున్న జనసంద్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఆ జనం అంతా ఓటర్లుగా మారతారా? ఇదే ప్రశ్నకు తాజాగా కమల్ హాసన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
తమిళ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నివాసంలో గుర్తు తెలియని అగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరీ భద్రత కలిగిన విజయ్ నివాసంలో ఆ అగంతకుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్‌మ్యా్‌పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.
తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ఇటీవల డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తిరుచ్చి నగరంలో ఆయన ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. విజయ్ పర్యటన కోసం సకల సదుపాయాలతో ఓ లగ్జరీ బస్సు పయనూరులోని ఆయన నివాసం వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు.
ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.
మదురై మహానాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలను విమర్శించడాన్ని ఖండిస్తూ ఆ పార్టీల నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలకు సేవలందిస్తున్న స్టాలిన్ను విజయ్ విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు.