TVK Vijay: విజయ్ కరూర్ పర్యటనకు భద్రత కల్పించండి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:08 PM
కరూర్ రోడ్‌షోలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబీకులను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఆ దిశగా ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
- డీజీపీకి న్యాయవాదుల వినతి
చెన్నై: కరూర్ రోడ్‌షోలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబీకులను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్(Vijay) తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఆ దిశగా ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత సెప్టెంబరు 27 రాత్రి కరూర్ వేలుచ్చామిపురం వద్ద విజయ్ రోడ్‌షోలో పాల్గొన్నప్పుడు తొక్కిలాట జరిగి చిన్నారులు, మహిళలు సహా 41 మంది దుర్మరణం చెందగా, వందమందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
తొక్కిలాట అధికం కావటంతో తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించి విజయ్ కరూర్ నుంచి ఆగమేఘాలపై చెన్నైకి తిరిగి వెళ్లారు. మార్గమధ్యంలో ఆయన తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న సమయానికి తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ విషయమై విలేఖరుల ప్రశ్నించినప్పుడు విజయ్ బదులు చెప్పకుండా విమానం ఎక్కి వెళ్ళిపోయారు. పయనూరు నివాసగృహంలో రోజంతా గడిపిన తర్వాత విజయ్ తన బసను నీలాంగరైలో ఉన్న మరో బంగ్లాకు మార్చారు.
అదే సమయంలో కరూర్ దుర్ఘటన జరిగి మూడు రోజులైన తర్వాత ఓ వీడియో సందేశం వెలువరించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్ కరూర్ వెళ్ళి మృతుల కుటుంబీకులను, గాయపడిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయించారు. ఆ దిశగా మంగళవారం సాయంత్రం విజయ్ కరూర్ పర్యటనకు భద్రత కల్పించాలంటూ ఈమెయిల్ ద్వారా సందేశం పంపారు.

బుధవారం ఉదయం టీవీకే నేత విజయ్ తరఫు న్యాయవాది అరివళగన్ సహా పలువురు న్యాయవాదులు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో విజయ కరూర్‌లో పర్యటించనున్న తేదీల వివరాలు కూడా ఉన్నాయని సమాచారం. వినతి పత్రం సమర్పించి తిరిగి వెళుతున్న న్యాయవాది అరివళగన్‌ను విలేకరులు చుట్టుముట్టి విజయ్ ఏ తేదీన కరూర్‌కు వెళతారని ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News