Actor Shekhar: హాస్య నటుడు శేఖర్ సంచలన కామెంట్స్.. విజయ్‌కి రాజకీయ పరిజ్ఞానం శూన్యం
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:35 AM
తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
- నటుడు ఎస్వీ శేఖర్
విజయ్‌కి రాజకీయ పరిజ్ఞానం శూన్యం
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్(SV Shekhar) అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇకపై స్టాలిన్‌కు తాను అండగా నిలవాలని అనుకుంటున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టీవీకే నేత రోడ్‌షోలకు జనం పెద్ద సంఖ్యలో రావటం గొప్ప విషయం కాదని, సినీ హీరోలను దగ్గరగా చూడటానికి అందరూ ఆసక్తి కనిపిస్తారని, ఆ సభలకు వచ్చినవారంతా ఆ పార్టీకి ఓటు వేయరనే చేదు నిజాన్ని విజయ్ గుర్తించాలన్నారు.

విజయ్ ప్రతి రోడ్‌షోలోనూ ఏదో కంఠస్థం చేసుకుని వచ్చిన డైలాగులు పలికి వెళ్తున్నారని, ఎవరో రాసిచ్చిన డైలాగులను సినిమా షూటింగ్‌లో చెప్పినట్లు ఆవేశంగా చెబుతున్నారని ఎస్వీ శేఖర్ విమర్శించారు. రాజకీయాల్లో 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారంతపు సెలవుదినాలైన శని, ఆదివారాల్లో మాత్రమే జనం ముందుకు రావటం విజయ్‌కి రాజకీయ పరిపక్వత లేదనే విషయాన్ని చాటిచెబుతోందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News