MP Jyothimani: విజయ్‌కి రాహుల్ ఫోన్ చేయడంపై రాజకీయ రంగు పూయొద్దు
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:40 PM
కరూరు దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ టీవీకే నేత విజయ్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవహరానికి రాజకీయ రంగు పులమద్దని కరూరు ఎంపీ జ్యోతిమణి అన్నారు.
- ఎంపీ జ్యోతిమణి
చెన్నై: కరూరు దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ టీవీకే నేత విజయ్(Vijay)కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవహరానికి రాజకీయ రంగు పులమద్దని కరూరు ఎంపీ జ్యోతిమణి(Karur MP Jyothimani) అన్నారు. కరూరులో ప్రాణాలు కోల్పోయిన దిండుగల్‌కు చెందిన ముగ్గురి కుటుంబాలకు శుక్రవారం ఆమె కాంగ్రెస్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..

కరూరులో కళ్లెదుటే తొక్కిసలాట జరిగిన పట్టించుకోకుండా వెళ్లిన టీవీకే నేత విజయ్ త్వరలో తాను చేసిన తప్పు ఎలాంటిదో అర్థం చేసుకోగలుగతారన్నారు. ప్రస్తుతానికి కరూరు దుర్ఘటనపై ఎలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, అదే సమయంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్, టీవీకేతో దోస్తీకడుతోందన్న పుకార్లను పట్టించుకోవద్దని ఆమె పార్టీ శ్రేణులకు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News