MP Kanimozhi: కరూర్ ఘటనపై రాజకీయ లబ్ధి చూడొద్దు..
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:06 PM
కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
- ఎంపీ కనిమొళి
చెన్నై: కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి(Thoothukudi MP Kanimozhi) విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకే మంత్రులు, అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారన్నారు. దీన్ని మరో కోణంలో చూడొద్దని కోరారు.

అలాగే, సీఎం స్టాలిన్(CM Stalin) కూడా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించడంతో పాటు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నిజ నిర్థారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. వీటన్నింటిని మించి మృతులు, బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించారన్నారు. ఇలాంటి సంఘటన జరిగివుండకూదన్నారు. జరగరానిది జరిపోయిందని, దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్దికోసం వెంపర్లాడరాదని ఆమె పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !
Read Latest Telangana News and National News