TVK Vijay: మీకు అండగా ఉంటా... త్వరలో కలుస్తా
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:48 AM
ఊహించలేనిది జరిగింది... ఏ రకంగాను మీ నష్టాన్ని భర్తీచేయలేం... ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటా... త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా’ అంటూ కరూర్ మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు.
- కరూర్ మృతుల కుటుంబాలకు విజయ్ వీడియో కాల్‌లో ఓదార్పు
చెన్నై: ‘ఊహించలేనిది జరిగింది... ఏ రకంగాను మీ నష్టాన్ని భర్తీచేయలేం... ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటా... త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా’ అంటూ కరూర్ మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్(Vijay) ఓదార్చారు. విజయ్ గత నెల 27న కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై పోలీసులు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీ నిర్మల్‌కుమార్ తదితరులపై కేసు నమోదు చేశారు.
వారిద్దరు ముందస్తు బెయిలు కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కరూర్ జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగన్‌ను అరెస్ట్ చేశారు. 41 మంది మృతిచెందిన ఘటనపై విజయ్ గత వారం ఆవేదనతో వీడియో విడుదల చేశారు. అలాగే, మృతుల కుటుంబాలకు తలా రూ.20 లక్షలు అందిస్తానని, మృతుల కుటుంబాలను త్వరలోనే కలుసుకుని ఓదార్చుతానని కూడా ప్రకటించారు.

ఈ క్రమంలో, సోమవారం రాత్రి కరూర్ మృతులకు సంబంధించిన కొంతమందికి వీడియో కాల్ చేసిన విజయ్.. వారిని పరామర్శించారు. మృతుల్లో ఒకరైన ధను్‌షకుమార్ తల్లి, సోదరితో వీడియో కాల్‌లో మాట్లాడిన విజయ్... ‘జరగకూడని ఘటన జరిగింది, ఏ రూపంలోనూ మీకు జరిగిన నష్టం పూడ్చలేం, ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటా, త్వరలో మిమ్మల్ని కలుస్తా’ అంటూ ఓదార్చారు. ధను్‌షకుమార్ కుటుంబ సభ్యులతో విజయ్ సుమారు 20 నిమిషాలు మాట్లాడారు.
‘కరూర్’పై సీబీఐ విచారణ
- సుప్రీంకోర్టులో బీజేపీ పిటిషన్
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 10న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై న్యాయవిచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. అదేవిధంగా మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ ఆస్రా కార్గ్ నేతృత్వంలోని ‘సిట్’ ఏర్పాటైంది. కాగా, ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని టీవీకే తరఫున దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక
- కరూర్ ఘటనపై దర్యాప్తు కోసం అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ వివరాలను అధికారిక గెజిట్‌లో ప్రచురించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ ఏకసభ్య కమిషన్ మూడు నెలల్లో దర్యాప్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని గెజిట్‌లో పేర్కొన్నారు.
ఘటన జరిగాక ఎవరినీ నిందించలేం
- సీనియర్ నటి అంబిక
ఘటన జరిగిన తర్వాత ఎవరినీ నిందించడంలో అర్థం లేదని సీనియర్ నటి అంబిక అన్నారు. కరూర్ వేలుచ్చామిపురంలో గత నెల 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీనియర్ నటి అంబిక మంగళవారం పరిశీలించి చుట్టుపక్కల వారితో మాట్లాడారు. అనంతరం అంబిక మీడియాతో మాట్లాడుతూ... ‘ఘటన జరిగిన వెంటనే వచ్చి బాధితులను పరామర్శించాలని అనుకున్నా. నేను ఈ ప్రాంతానికి రావడంలో ఎలాంటి రాజకీయం లేదు. ఎవరికో మద్దతుగానో, వ్యతిరేకంగా మాట్లాడేందుకు రాలేదు. పిల్లలను తీసుకొచ్చి తల్లిదండ్రులు తప్పుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు. సభలకు వెళ్లే ప్రజలు, అభిమానులు జాగ్రత్తలు పాటించాలి’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa