Congress MP: కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్.. ఎన్నికల తర్వాత ఆ హీరో ప్రతిపక్షనేతగా ఉంటారు..
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:09 AM
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే నేత, హీరో విజయ్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు.
- ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతగా విజయ్
- కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ జోస్యం
చెన్నై: వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే నేత, హీరో విజయ్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు మంగళవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలంతా రూ.2కోట్ల మేర ధనాన్ని పొదుపు చేయగలుగుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

కొత్త జీఎస్టీ 2.0 ద్వారా ప్రతిభారతీయుడికి ప్రతినెలా రూ.137లు మాత్రమే ఆదా అవుతుందని, ధనవంతులు మాత్రమే కొత్త జీఎస్టీ వల్ల కోట్లకు పడగలెత్తుతారని, ఇదే వాస్తవమన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల దేశంలో సరికొత్త విప్లవం ఏర్పడిందంటూ చెప్పటం కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి పన్నులు పెంచి ప్రస్తుతం వాటిని తగ్గించి ప్రజలకు మేలు చేసినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటనలు చేయడం గర్హనీయమన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), బీజేపీ నేత అన్నామలై కలిసి టీవీకే నేత విజయ్‌ని ప్రతిపక్షనేతగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

ఈపీఎస్ తన పార్టీలో ఉన్న సీనియర్ నేతలను ద్రోహులనే ముద్రవేసి తరిమికొడుతూ పార్టీ బలహీనంగా మారుతోందనే విషయం కూడా గమనించకపోవడం శోచనీయమన్నారు. దీనితో అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని, ఆ హోదా టీవీకే నేత విజయ్ పొందే అవకాశం ఉందని మాణిక్కం ఠాకూర్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రూ.2080 కోట్ల విద్యానిధులను కేంద్రంలోని బీజేపీ పాలకులు నిలిపివేయడం తమిళ ప్రజలకు చేస్తున్న తీరని ద్రోహంగా భావించాలన్నారు. ఇకనైనా కేంద్రం విద్యానిధులను వీలయినంత త్వరగా విడుదల చేసిన నిరుపేద విద్యార్థుల చదువులు సవ్యంగా సాగేలా చూడాలని హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News