Chidambaram: కరూర్ దుర్ఘటనలో తప్పులున్నాయి..
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:13 PM
కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
- కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం
చెన్నై: కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం(P. Chidambaram) అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ సభలో జరిగిన ఈ దుర్ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత చిదంబరం సోమవారం తన ఎక్స్‌పేజీలో ఈ మేరకు పోస్టు చేశారు.

కరూర్(Karoor) దుర్ఘటనలో 17 మంది పురుషులు, 15 మంది మహిళలు, 9 మంది చిన్నారులు మృతిచెందడం, మరికొంత మంది గాయపడడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో ప్రసారమైన కథనాలు చూసిన అనంతరం కరూర్‌లో అన్ని వైపులా తప్పులున్నట్లు తనకు స్పష్టమవుతోందన్నారు.

ఈ అభిప్రాయాన్నే తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వ కార్యదర్శికి ఫోన్ చేసి కొన్ని సలహాలిచ్చానని, వాటిని పరిశీలించి నిర్ణయంతీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కరూర్ వ్యవహారంలో ప్రభుత్వ ఆచితూచి అడుగులు వేయాలని రాజకీయ పార్టీలు నిబంధనలకు లోబడి బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చిదంబరం సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News