Home » Harish Rao
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగినాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పడావు పెట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.
అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) హెచ్చరించింది.
బనకచర్ల పేరిట గోదావరి నీళ్లను ఏపీ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం. ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. అప్పుడే బనకచర్లకు పునాది పడిందన్నారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రస్తావనేరాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకుని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని మాజీమంత్రి హరీశ్‌రావు నిలదీశారు.
సిగాచి పరిశ్రమలో పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన కార్మికులు బలికావడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. 20 నెలల్లో 12 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా వారిని మోసం చేశారని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Harish Rao: విషయం లేకనే.. సీఎం రేవంత్ రెడ్డి బూతులు ఎత్తుకున్నారని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు.
కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ చైర్మన్‌కు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు.