Harish Rao : రేపు హైదరాబాద్‌కు హరీశ్, కవిత ఎపిసోడ్లో కొత్త టర్న్!
ABN , Publish Date - Sep 05 , 2025 | 10:23 PM
హైదరాబాద్‌కు రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వస్తున్నారు. లండన్ పర్యటన నుంచి ఆయన రేపు తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. కవిత ఎపిసోడ్ పై ఆయన స్పందన..
హైదరాబాద్, సెప్టెంబర్ : హైదరాబాద్‌కు రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వస్తున్నారు. లండన్ పర్యటన నుంచి ఆయన రేపు తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. గత సోమవారం హరీశ్ రావు, యూకే పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. మరో వైపు, కవిత ఎపిసోడ్ పై హరీశ్ రావు ఎలా స్పందిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే, కవిత ఎపిసోడ్‌ను బీఆర్ఎస్ నాయకత్వం లైట్ తీసుకుంటోంది. అటు, హరీశ్ రావుకూడా తనపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలను పట్టించుకోరని కూడా భావిస్తున్నారు. పార్టీకి కేసీఆరే సుప్రీం అంటున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ప్రజల కోసం కలసి పనిచేయడమే కేసీఆర్ నేర్పించారని హరీశ్ రావు చెబుతున్నారు. ఇక, యూకే పర్యటన నుంచి రాగానే హరీశ్ రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లబోతున్నారు. కేసీఆర్, కేటీఆర్‌తో ఆయన సమావేశం కానున్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్ పై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest Andhra Pradesh News and National News