BREAKING: బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్.. ఎక్స్ వేదికగా ట్వీట్
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:41 PM
బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలకు మాజీ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు..
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొందరు ఎవరికోసమో.. హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రక్షణగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థులకు ఊతం ఇచ్చేలా మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తేల్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయని సూచించారు. శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటంలో ఎజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్‌రావు సహా అందరం బాధపడ్డామని గుర్తు చేశారు. వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు సరికాదు నిరంజన్ రెడ్డి హితవు పలికారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత