Former Minister Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తాం..
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:45 PM
కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ స్థాయి ఏంటో అందరికీ తెలుసని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌పై కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పాలనను జనం అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడారు.. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత ఆలోచనలతో.. అధికారంలోకి వచ్చిందని ప్రజలు గ్రహించారని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కాంగ్రెస్ పతనం ప్రారంభం అవుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త.. శక్తికి మించి పనిచేయాలని అప్పడే విజయం చేకూరుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని.. జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.