Share News

Harish Rao fires on Revanth Reddy: రేవంత్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ధి బందు: హరీశ్ రావు

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:47 PM

రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు అయిపోయాయని హరీశ్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Harish Rao fires on Revanth Reddy: రేవంత్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ధి బందు: హరీశ్ రావు
MLA Harish Rao

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు చేశారని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందైపోయాయని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ తీరు వల్ల చాలా సమస్యలు మొదలయ్యాయని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు హరీశ్ రావు(Harish Rao attack Revanth Reddy).


'బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు. జాబ్ క్యాలెండర్ బందు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు. నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు. డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బందు. రైతులకు రుణ మాఫీ బందు. పంట బోనస్ బందు. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బందు. పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బందు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ది బందు. ఎక్కడ చూసినా బందు, బందు, బందు' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు ( Telangana politics).


రేవంత్ రెడ్డి పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారని, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్దమయ్యారని హరీశ్ రావు పేర్కొన్నారు (Harish Rao comments). ప్రస్తుత ప్రభుత్వ డ్రామాలను బందు పెట్టే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయంటూ హరీశ్ రావు కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 08:34 PM