Harish Rao: రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
ABN , Publish Date - Sep 16 , 2025 | 08:16 AM
సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు మాజీ మంత్రి హరీశ్‌రావును సోమవారం కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులు భూములు కోల్పోకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)ను సోమవారం కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులు భూములు కోల్పోకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు అలైన్‌మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు అలైన్‌మెంట్ మార్పుతో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన రైతులే తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

ఓఆర్‌ఆర్(ORR) నుండి ట్రిబుల్ ఆర్ వరకు 40 కి.మీ దూరం ఉండవలసి ఉండగా 23 కి.మీ దూరంలో ట్రిబుల్ ఆర్‌ను ప్రభుత్వం చేపట్టిందని, సొంత భూములకు మేలు కలిగేలా ముఖ్యమంత్రి(Chief Minister) అలైన్‌మెంట్‌ను అడ్డగోలుగా మార్చడం దుర్మార్గపు చర్య అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేయకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం
మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్
ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
Read Latest Telangana News and National News