Home » Guntakal
శెట్టూరు మండల పరిధిలోని ల క్ష్మంపల్లికి చెందిన సత్యన్న అనే రైతు పొలంలోని ట్రా న్సఫార్మర్‌ను ఆది వారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లినట్లు రైతు సత్యన్న సోమవారం శెట్టూరు పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా డు.
స్థానిక హౌసింగ్ డీఈఈ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం కంప్యూటర్ ఆపరేటర్లే విధులు నిర్వహించారు. డీఈఈ, ఏఈల కోసం పలువురు లబ్ధిదారులు, మాజీ కౌన్సిలర్లు కార్యాల యానికి వచ్చి వెళ్లారు. వారికి కంప్యూటర్ ఆపరేటర్లే సమాధా నమిచ్చి పంపారు.
ప్రజా సమస్యల పరి ష్కారం కోసం సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు(పీజీఆర్‌ఎస్)కు చాలా మంది అధి కారులు డుమ్మా కొట్టారు. ప్రతి సోమవారం ఇలాగే ఉందని, దీంతో పెం డింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు తీరడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
రైతుల సంక్షేమం కోసం ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన పథకం నిధులు విడుదల కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, మరో 15 ఏళ్ల పా టు కూటమి అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం అన్న దాత సుఖీభవ పథకాన్ని ఆర్డీవో వసంతబాబు, ఏడీఏ ఎల్లప్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
వ్యవసాయంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవడంలో సీఎం చంద్ర బాబునాయుడు ముందుంటారని, రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసు లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శనివారం మండ లంలోని కెంచానపలిలో వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ ఆధ్వర్యం లో నిర్వహించారు.
పట్టణం లోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆల యంలో వల్లీదేవసేన సమే త న్రాగ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠను శని వారం ఘనంగా నిర్వహిం చారు.
డి. హీరేహాళ్ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్‌ఐ లోకేశ కు మార్ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.
అనాథ లుగా మారిన చిన్నారులకు ట్రాన్సకో ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ రవిశంకర్ రూ.20వేలు నగదు అందజే శారు. మండలంలోని పెద్దపేటకు చెందిన పల్లా శివ ప్రసాద్, భార్య హేమావతి చేతిలో హత్యకు గు రికావడం, హేమావతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి నలు గురు పిల్లలు అనాథలుగా మారారు.