Share News

DOGS: ఏటీఎం వద్ద కుక్కల బెడద

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:37 PM

మేము ఉండగా సెక్యూరిటీ గార్డు ఎందుకు దండగా..? అన్నట్లుగా నాలుగైదు వీధికుక్కలు కణేకల్లులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దనే ఉంటున్నాయి. దీంతో ఖా తాదారులు ఏటీఎంలోకి వెళ్లాలంటేనే భయపడుతు న్నారు. ఖాతాదారుల భద్రత కోసం సెక్యూరిటీ గా ర్డు ఉండాల్సిన చోట అవి మకాం వేస్తుండడంతో వి నియోగ దారులు భయంతో ఏటీఎంలోకి అ డుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.

DOGS: ఏటీఎం వద్ద కుక్కల బెడద
Dogs camped at the ATM entrance.

- భయపడుతున్న ఖాతాదారులు

కణేకల్లు, జూన 13(ఆంధ్రజ్యోతి): మేము ఉండగా సెక్యూరిటీ గార్డు ఎందుకు దండగా..? అన్నట్లుగా నాలుగైదు వీధికుక్కలు కణేకల్లులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దనే ఉంటున్నాయి. దీంతో ఖా తాదారులు ఏటీఎంలోకి వెళ్లాలంటేనే భయపడుతు న్నారు. ఖాతాదారుల భద్రత కోసం సెక్యూరిటీ గా ర్డు ఉండాల్సిన చోట అవి మకాం వేస్తుండడంతో వి నియోగ దారులు భయంతో ఏటీఎంలోకి అ డుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. కణేకల్లులో ఎస్‌ బీఐ ఏటీఎం కేంద్రం వద్ద నాలుగైదు శునకాలు నిత్యం ద్వారం ముందే పడుకుని ఉంటున్నాయి. దీంతో డబ్బులు డ్రా చేసుకు నేందుకు వచ్చే మహిళలు, వృద్ధులు తదితరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు శునకాలు ఒక్క సారిగా మొరగుతుండ టంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.


ఏటీఎం వద్ద సె క్యూరిటీ గార్డు లేకపోవడమే ఈ పరిస్థితికి కార ణమని స్థానికులు చెబుతున్నారు. బ్యాంకు అధి కారులు వినియోగదారుల భద్రతను గాలికొ దిలే శారని విమర్శిస్తున్నారు. రోజూ వందలాది మంది ఖాతాదారులు వచ్చే ఏటీఎం వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగేలోగా బ్యాంకు అధికారులు స్పందించి సెక్యూరిటీ గార్డును నియమించాలని అంటు న్నారు. అదేవిధంగా ఏటీఎం వద్ద శునకాల సం చారాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని ఖాతా దారులు, స్థానికులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2026 | 11:37 PM