Share News

MLA: టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:12 AM

టీడీపీ ప్రభుత్వంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని జక్కలచెరువు గ్రామంలో రూ. 20లక్షలతో డ్రైనేజీ కాలువను నిర్మించారు. ఎమ్మెల్యే గురువారం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు.

MLA: టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి
MLA Gummanur welcoming someone into the party by draping the TDP scarf around them.

- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుత్తి రూరల్‌, జూన 11(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని జక్కలచెరువు గ్రామంలో రూ. 20లక్షలతో డ్రైనేజీ కాలువను నిర్మించారు. ఎమ్మెల్యే గురువారం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్ర జల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన ప్రతాప్‌, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీన, టీడీపీ పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి, లక్ష్మీరంగయ్య, టీడీపీ సీనీయర్‌ నాయకులు, చిన్నరెడ్డి యాదవ్‌, లక్ష్మీనారాయణమ్మ, వెంకటనారాయణ, తిమ్మప్ప, గోవర్దన గౌడ్‌, పంచాయితీ రాజ్‌ డీఈఈ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

గుత్తి మంండలంలోని జక్కలచెరువు గ్రామానికి చెందిన 30 కుటుం బాల వారు గురువారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివశంకర్‌, చింతకాయల రంగస్వామి, నారాయణ, జయరాముడు, చిన్న ఇబ్రహీం, రమేష్‌, హనుమంతు, పాటు మరో 30 కుటుంబాల వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వనించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 12 , 2026 | 12:12 AM