MLA: రెండేళ్ల ప్రగతి కానుకగా పార్కు ఏర్పాటు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:18 AM
రెండేళ్ల కూటమి పాలన ప్రగతికి కానుకగా చంద్రబాబు పార్కును ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని బళ్లారిరోడ్డులోని శాంతినగర్‌లో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునీకీకరించిన చంద్ర బాబునాయుడు పార్కును గురువారం సాయంత్రం ఆయన ప్రా రంభించారు.
-ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, జూన 11(ఆంధ్ర జ్యోతి): రెండేళ్ల కూటమి పాలన ప్రగతికి కానుకగా చంద్రబాబు పార్కును ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని బళ్లారిరోడ్డులోని శాంతినగర్‌లో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునీకీకరించిన చంద్ర బాబునాయుడు పార్కును గురువారం సాయంత్రం ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అప్పటి మున్సిపల్ చైర్మన పూజారి జితేంద్రప్ప ఆధ్వర్యంలో ఈ పార్కును ఏర్పాటు చేశారన్నారు. అనంతరం సరైన నిర్వహణ లేక పోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ. 40 లక్షలతో సమగ్రంగా ఆధునీకరించి, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దినట్లు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పట్టణ శివారులో నగరవనా న్ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణం లోని ఇతర పార్కులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....