MLA: బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాల పంపిణీ
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:15 AM
పట్టణ సమీపంలోని గన్నె వారిపల్లి పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ ధ్వర్యంలో బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు రుణ మం జూరు పత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వానికి పేదలపట్ల ఎంతో అభిమానమని, దీంతో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
తాడిపత్రి, జూన 11(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని గన్నె వారిపల్లి పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ ధ్వర్యంలో బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు రుణ మం జూరు పత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వానికి పేదలపట్ల ఎంతో అభిమానమని, దీంతో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. అందులోభాగంగా బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్లపట్టాలను మంజూరుచేసిందని తెలిపారు. వీటిని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలనిఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చింబిలి వెంకటరమణ, చింబిలి ప్రసాద్ నాయుడు, హరినాథ్‌రెడ్డి, పవన కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు టాటా హాజి, విజ్జి, మల్లికార్జున అధికారులు తహశీల్దార్ రవిచంద్ర, ఎంపీడీఓ శ్రీనివాసులు, హౌసింగ్ డీఈ షెక్షావలి, రాజశేఖర్, నవీనకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....