Share News

MLA: వర్షాభావం తట్టుకునే పంటలను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:08 AM

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తదనుగు ణంగా పంటలసాగు ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఖరీఫ్‌సాగుపై గురు వారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

MLA: వర్షాభావం తట్టుకునే పంటలను ప్రోత్సహించాలి
MLA Kalava reviewing with farmers

- అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం, జూన 11(ఆంధ్ర జ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తదనుగు ణంగా పంటలసాగు ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఖరీఫ్‌సాగుపై గురు వారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ది గుబ డులు సాధించేలా పంటల సాగు విధానంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, సలహాలు సకాలంలో ఇవ్వాలని వ్యవసాయ సి బ్బందిని సూచించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందేలా చూడాలన్నారు. వేరుశనగకు ప్రత్యామ్నాయంగా కం ది, ఆముదం సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని వీటితో పా టు ఉలవ, కొర్ర పంటలను ప్రోత్సహించాలన్నారు. బొమ్మనహాళ్‌, కణే కల్లు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్నందున యూరియా కొరత రాకుండా ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలతో నివేదికలు పంపాలన్నారు. నియోజకవర్గంలో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం లెక్కల్లో తేడాలున్నాయని, వీటిపై దృష్టి పెట్టి నివేదికలు సరిచేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. రైతులకు పంట నష్టం వాటిల్ల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ, నియోజకవర్గ పరిధి లోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 12 , 2026 | 12:08 AM