WORKERS: యాప్ పనిచేయకపోతే మా కూలి ఎలా?
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:47 PM
ఉపాధిహామి పథకంలో యాప్ పనిచేయకపోతే తాము పనులు చేసిన కూలి సొమ్ము నష్టపోవాలా అని ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో వీరరాజు, ఏపీవో చిన్నమద్దిలేటిని ప్రశ్నించారు. వారు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధికూలీలు ఎంపీడీవో, ఏపీవోతో వాగ్వాదానికి దిగారు.
- అధికారులతో ఉపాధి హామీ కూలీల వాగ్వాదం
యాడికి, జూన 10(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామి పథకంలో యాప్ పనిచేయకపోతే తాము పనులు చేసిన కూలి సొమ్ము నష్టపోవాలా అని ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో వీరరాజు, ఏపీవో చిన్నమద్దిలేటిని ప్రశ్నించారు. వారు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధికూలీలు ఎంపీడీవో, ఏపీవోతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ... గతవారంలో తాము ఆరురోజులు పనిచేస్తే ఐదురోజులు మాత్రమే యాప్‌లో హాజరువేశారని తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోందని ఉపాధిహామీ సిబ్బందిని ప్రశ్ని స్తే యాప్ పనిచేయడం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. క ష్టం చేసిన సొమ్మును యాప్‌పేరుతో దోచుకుంటున్నారా అని నిలదీశారు. కూలీలకు అన్యాయం జరిగితే ఊరుకొనేది లేదన్నారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ కూలీలు పనిచేసిన రోజులు నష్టపోకుండా ప్రతి కూలీకి పని చేసే దినాలకు సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....