FARMERS: పంటల సాగుకు భూసార పరీక్షలు తప్పని సరి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:52 PM
రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేసే సమ యంలో భూసార పరీక్షలు చేయించుకోవా లని విశాఖపట్నం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ పరిశోధనాధికారి డాక్టర్ కె .రాంబాబు, కేంద్ర వ్యవసాయశాఖ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అధికారి డాక్టర్ పి. రాము పేర్కొన్నారు.
- పరిశోధన అధికారులు రాంబాబు, రాము
కూడేరు, జూన 10(ఆంధ్రజ్యోతి): రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేసే సమ యంలో భూసార పరీక్షలు చేయించుకోవా లని విశాఖపట్నం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ పరిశోధనాధికారి డాక్టర్ కె .రాంబాబు, కేంద్ర వ్యవసాయశాఖ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అధికారి డాక్టర్ పి. రాము పేర్కొన్నారు. వారు బుధవారం కూడేరు మండల పరిధిలోని తిమ్మాపురం, కడదరకుంట తదితర గ్రామాల్లో రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ వ్యవసాయంలో రాణించాలంటే ఖచ్చితంగా భూసార పరీక్షలు నిర్వ హించి, పంటలు సాగు చేయా లన్నారు. వివిధ అంశాలపై రైతులకు సలహలు, సూచనలు అందించారు. వారితోపాటు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ రోజా పుష్పలత, శ్రీనాథ్‌రెడ్డి, మెహరున్నిసా, ఏవో శుభకర్ తదితరులు హాజరయ్యారు.
వేరుశనగ విత్తనకాయల పరిశీలన
ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీతో అందజేసే వేరుశనగ విత్తనకాయలు మండలానికి సరఫరా చేశారు. మండలకేంద్రంలోని వ్యవసాయ శాఖ గోడౌనలో ఉంచిన వాటి నాణ్యతను రైతుల సమక్షంలో టీడీపీ నాయకులు, వ్యవసాయాధికారులు బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో శుభకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వేరుశనగపంట సాగు చేసే రైతులు విత్తనకాయల కోసం ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఏవో తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....