Share News

ROAD: రోడ్డుపై మురుగు తొలగింపు

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:05 AM

మండలంలోని తార్కాపురం గ్రామంలో రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగించేందుకు పంచా యతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు రహదా రిపై ప్రవహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుండేది.

ROAD: రోడ్డుపై మురుగు తొలగింపు
Officials having the work carried out using an excavator.

బొమ్మనహాళ్‌, జూన 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని తార్కాపురం గ్రామంలో రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగించేందుకు పంచా యతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు రహదా రిపై ప్రవహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుండేది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఇనచార్జ్‌ కార్యదర్శి పల్లవి చర్యలు చేపట్టారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా కాలువలను శుభ్రం చేయిం చారు. గ్రామంలో ఈ నెల 16న మహాలక్ష్మి రథోత్సవం జరగనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండ టంతో గ్రామంలో పారిశుఽ ద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కార్యదర్శి పల్లవి తెలిపారు. రోడ్డుపై మురుగు తొలగించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 11 , 2026 | 12:05 AM