Share News

GOD: వైభవంగా పాండురంగ రథోత్సవం

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:05 AM

మండలంలోని ఉంతకల్లు గ్రామంలో వెలసిన రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్ర పండరీపురంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో నిర్వహించిన రథోత్సవానికి వేల మంది భక్తులు తరలివచ్చారు.

GOD: వైభవంగా పాండురంగ రథోత్సవం
The chariot procession is underway amidst a massive crowd.

- ఉంతకల్లులో పోటెత్తిన భక్తజనం

బొమ్మనహాళ్‌, జూన 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంతకల్లు గ్రామంలో వెలసిన రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్ర పండరీపురంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో నిర్వహించిన రథోత్సవానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం రుక్మిణీ పాండురంగస్వామికి పంచా మృతాభిషేకం, అలంకరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు, శ్రీవారి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి, పండరీపురం పీఠాధిపతి గోపాల్‌మహారాజ్‌ చేతుల మీదుగా రథానికి పూజలు నిర్వహించి, ఉత్సవాన్ని ప్రారంభించారు. పాండురంగ నా మ స్మరణ, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం వైభవంగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ ఆలయంలో పాండురంగ స్వామిని దర్శించుకుంటే మద్యపానం వంటి చెడు వ్యసనా లు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రథోత్సవం సందర్భం గా ఆలయ కమిటీ ఆఽధ్వర్యంలో అన్నదానంతోపాటు భక్తులకు సౌకర్యా లు కల్పించారు. ఎస్‌ఐ నబీరసూల్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 12 , 2026 | 12:05 AM