Home » Guntakal
డి. హీరేహాళ్ మండలంలోని దొడగట్ట గ్రామ ఆంబేడ్కర్ కాలనీ వాసులు నాలుగు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్ కెనాల్ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది.
మండల పరిధిలోని తిమ్మా పురం గ్రామంలో అక్క దేవతల నెల పూజను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల క్రితం తిమ్మాపురంలోని ఆలయం నుంచి కరుట్లపల్లి ఆలయానికి అక్కదేవతల గిరిగలను తెచ్చి మూడు రోజు లు పరుష నిర్వహించారు.
స్థానిక మండల పరిషత కార్యాలయంలో సోమవారం జరగవలసిన ఉపాధిహామి పథకం పనులు పూర్తిగా స్తంభించాయి. టెక్నికల్ అసిస్టెంట్లు మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టడంతో కూలీల బిల్లులు, కొలతల ప్రక్రియ నిలిచిపోయింది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. పట్టణంలోని జయంతి రాధాకృష్ణయ్యశెట్టి కల్యాణ మం డంపంలో ఈ నెల 22వ తేదీన చేపట్టే ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
మండలంలోని కర్ణాటక సరిహద్ధులో ఉన్న గో విందవాడ గ్రామంలో నాసిరకం పురుగుమం దుల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ఓ ఫర్టిలై జర్ దుకాణంలో సెకండ్ సేల్ పేరుతో బయో కంపెనీలకు చెందిన పురుగుమందులను కర్ణాట క రాష్ట్రంలోని కంప్లి, కురుగోడు, గంగావతి ప్రాంతాల నుంచి అక్రమంగా దిగమతి చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం వైభవంగా స్వామికి పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్దానిక పొట్టి శ్రీ రాములు సర్కిల్‌లో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ప్రజా దర్బారులో విన్న వించే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బారును నిర్వహించారు.