Share News

WATER: రాయలచెరువులో నీటిఎద్దడి

ABN , Publish Date - May 12 , 2026 | 11:40 PM

మండలంలోని రాయలచెరువులో నీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు పం పించే ట్యాంకర్ల వద్ద నీటికోసం గుంపులు గుంపులుగా చేరుతున్నారు. రెండురోజులుగా రాయలచెరువులో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు తెలిపారు.

WATER: రాయలచెరువులో నీటిఎద్దడి
Locals fetching water from a tanker

యాడికి, మే12(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయలచెరువులో నీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు పం పించే ట్యాంకర్ల వద్ద నీటికోసం గుంపులు గుంపులుగా చేరుతున్నారు. రెండురోజులుగా రాయలచెరువులో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు తెలిపారు. కొళాయిలకు నీరు సరిగా రావడం లేదన్నారు. దాతలు ట్యాం కర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, ట్యాంకర్‌ వచ్చిన సమయం లో బిందెడు నీటికోసం పెద్దగొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అ ధికారులు చర్యలు తీసుకొని గ్రామస్థులకు సరిపడేంత నీటిని సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. రాయలచెరువులో నీటి ఎద్దడిపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ వివరణ కోరగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ఆందోళనలో ఉండడంతో తగినంత నీరు సరఫరా కావడం లేదని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులను పంపి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్థులకు తాగునీటి కొరత లేకుండా చేస్తామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 12 , 2026 | 11:40 PM