Share News

JCPR: ప్రజలే నా దేవుళ్లు

ABN , Publish Date - May 11 , 2026 | 12:06 AM

ప్రజలే తన దేవుళ్లని, వారి మధ్యే తన పుట్టిన రోజును ఈనెల 25న వినూత్నరీతి లో జరుపుకుంటానని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆది వార స్థానిక నివాసంలో విలేకరుల సమా వేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత పుట్టినరోజులను సాధారణంగా దివ్యాంగు ల మధ్య జరుపుకొనే వాడినని తెలిపారు.

JCPR: ప్రజలే నా దేవుళ్లు

- వారి మధ్యే నా పుట్టిన రోజు: జేసీపీఆర్‌

తాడిపత్రి, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రజలే తన దేవుళ్లని, వారి మధ్యే తన పుట్టిన రోజును ఈనెల 25న వినూత్నరీతి లో జరుపుకుంటానని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆది వార స్థానిక నివాసంలో విలేకరుల సమా వేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత పుట్టినరోజులను సాధారణంగా దివ్యాంగు ల మధ్య జరుపుకొనే వాడినని తెలిపారు. అయితే ప్రజలే నా దేవుళ్లు అని తాను ఎప్పుడూ చెబుతుండే మాటను అనుసరిం చి, ఈ యేడు పుట్టిన రోజును ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన సర్కిల్‌లో గాంధీ విగ్రహం వద్ద ఆ దేవుళ్ల మధ్యనే జరుపుకోవాలని నిర్ణయించు కున్నానని తెలిపారు. తన పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే వినూత్నరీతిలో జరపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మూడు ప్రశ్నలు ఇచ్చి, సమాధానాలు ఇలా అడుగుతున్నారు.

1. నా పుట్టినరోజు ఎలా చేసుకుంటే బాగుంటుంది తెలియజేయాలి.2. సమాజంలో మహిళల పాత్ర ఎలా ఉంది? వారి బాధ్యత ఎలా నెరవేరు స్తున్నారు? 3. ప్రస్తుతం సమాజంలో విద్యార్థుల ఎలా ఉంటున్నారు?

ఈ మూడు ప్రశ్నలపై ఈనెల 17లోగా ప్రజలు సమాధానాలు ఇవ్వాల న్నారు. ఇందుకోసం పట్టణంలోని లలిత మెగామాల్‌, వద్దిషోరూం, బిగ్‌సి సెల్‌పాయింట్‌ తాడిపత్రి ఈవెంట్‌తోపాటు పలు చోట్ల బాక్సులు ఏర్పాటుచేశామని తెలిపారు. మీ సమాధానాలు రాసి ఆ బాక్స్‌లో వేయాలని ఆయన ప్రజలను కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 11 , 2026 | 12:06 AM