Home » Gujarat
గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు సమీపంలో రెండు వాణిజ్య నౌకలు ఢీకున్నాయి. ఎంవీ ట్రూ మారినర్ వాణిజ్య నౌక, ఎంవీ కేమ్యాక్స్ ఎంపీరర్ వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి.
26 రోజుల క్రితం ఓ యువతి బైకుపై వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణంగా యువతి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సూరత్‌లోని (గుజరాత్) సరోలీ ప్రాంతంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని పైఅంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం పెను కలకలానికి దారి తీసింది.
ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ వడోదరలో రూ. 35,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు.
‘‘నేను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలోనే ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లారు. అమెరికా పెట్టుబడులు గుజరాత్‌కు రాకుండా, తెలంగాణకు వెళ్తాయన్న ఉద్దేశంతో నా పర్యటనకు అనుమతి నిరాకరించారు.
ఓ మహిళ స్కూటీ నేర్చుకోవడానికి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన స్కూటీ వేగంగా వెళ్లి షాపు షట్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళకు గాయాలు అయ్యాయి.
భారతీయ వ్యాపారి సురేశ్ పటేల్‌ను హత్య చేసిన దోపిడీ దొంగ కోసం అమెరికా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిటీ ఆఫ్ జాక్సన్ పోలీసులు నిందితుడి చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ విచిత్రమైన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో కస్టమర్లు సమాధుల మధ్య కూర్చుని ఆహారం తింటారు, పానీయాలు తాగుతారు. అహ్మదాబాద్‌లో ప్రాచూర్యం పొందిన ఆ రెస్టారెంట్‌కు జనం ‘శ్మశానం రెస్టారెంట్’ అని పేరు పెట్టారు.
జంతర్ మంతర్ వద్ద యువత నిరసనల నేపథ్యంలో కలత చెందిన ఓ గుజరాత్ పోలీసు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో గాంధీధామ్‌లోని గోపాల్‌పురి పోర్ట్ టౌన్‌షిప్‌లో 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన 'తిరంగా యాత్ర' పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని, ఐక్యతను నింపింది.