Amitabh Bachchan: గుజరాత్ ఎయిర్ పోర్ట్‌లో అమితాబ్ బచ్చన్‌కి తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:49 PM
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే గుజరాత్ ఎయిన్ పోర్ట్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి ఎదురైంది.
గుజరాత్: సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సూరత్ విమానాశ్రయానికి అమితాబ్ బచ్చన్ చేరుకున్నప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఆయన తన కారు వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో సెల్ఫీల కోసం ముందుకు దూసుకురావడంతో అక్కడ తోపులాట జరిగింది. జనాల ఒత్తిడితో ఎయిర్ పోర్ట్‌లోని ఒక భారీ అద్దం పగిలిపోయింది.
ఈ సంఘటన జరిగే సమయానికి అమితాబ్ బచ్చన్ అద్దానికి సమీపంలో ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను అప్రమత్తం చేసి సురక్షితంగా కారులోకి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ అద్దం ఆయనపై పడి ఉంటే తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. అమితాబ్ బచ్చన్, తన స్నేహితుడు సునీల్ షాను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అభిమాన హీరో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
28 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి