Home » GHMC
తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధాకారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ విషయం బంజారాహిల్స్‌లో జరిగింది. తాగే నీటితో వాహనాలు కడగడం కొందరికి పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలింగ్ రోజు కేంద్రాల్లో జరిగే విషయాలను పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు.
ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాలని ఆయన కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధిపైనే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఫోకస్ పెట్టింది. గతంలో ఇతర సంస్థలకు చెందిన భూములను సైతం అభివృద్ధి చేసి హెచ్‌ఎండీఏ విక్రయించింది. ప్రస్తుతం ప్లాట్ల ఈ-వేలం నుంచి హెచ్‌ఎండీఏ పూర్తిగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.