Hyderabad Ganesh Immersions: కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. ప్రణాళికలు రచిస్తున్న జీహెచ్ఎంసీ
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:00 PM
ఖైరతాబాద్, కూకట్‌పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌తోపాటు నగరవ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు.
హైదరాబాద్: నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అధికారుల భద్రతా ఏర్పాట్ల మధ్య అంగరంగ వైభవంగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనాల కోసం అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఈ సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ విగ్రహాలు ప్రతిష్టించడంతో.. నిమజ్జనాలకు ఆలస్యం అవుతోందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని వినాయక విగ్రహాల వివరాలను వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకూ 2,68,755 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఒకటిన్నర అడుగుల నుంచి 3 అడుగుల వరకు ఉన్న 95,782 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. 3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న 1,72,973 విగ్రహాలను కూడా గంగమ్మ ఒడికి చేర్చినట్లు చెప్పారు. అయితే ఇంకా పలు చోట్ల వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో జోన్ల వారీ వివరాలు:
ఎల్బీ నగర్ జోన్: 37,800 విగ్రహాలు
చార్మినార్ జోన్: 23,453 విగ్రహాలు
ఖైరతాబాద్ జోన్: 63,468 విగ్రహాలు
శేరిలింగంపల్లి జోన్: 42,899 విగ్రహాలు
కూకట్‌పల్లి జోన్: 62,623 విగ్రహాలు
సికింద్రాబాద్ జోన్: 38,512 విగ్రహాలు
ఖైరతాబాద్, కూకట్‌పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌తోపాటు నగరవ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. 74 ఆర్టిఫిషియల్ కొలనులను సైతం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహేశ్‌గౌడ్‌కు సీఎం రేవంత్ సన్మానం