Share News

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రెండురోజులు నీటి సరఫరా బంద్‌

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:38 AM

కూకట్‌పల్లి జలమండలి పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని జీఎం హరిశంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్‌-1 డయా వాల్వుల మార్పు పనుల్లో భాగంగా 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రెండురోజులు నీటి సరఫరా బంద్‌

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) జలమండలి పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని జీఎం హరిశంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్‌-1 డయా వాల్వుల మార్పు పనుల్లో భాగంగా 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కూకట్‌పల్లి, వివేకానందనగర్‌(Kukatpally, Vivekanandanagar), భాగ్యనగర్‌, ఎల్లమ్మబండ, మూసాపేట్‌, భరత్‌నగర్‌, మోతీనగర్‌,


city1.2.jpg

గాయత్రినగర్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, బాలానగర్‌(Balajinagar, Balanagar), హస్మత్‌పేట్‌ సెక్షన్ల పరిధిలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదన్నారు. రెండు రోజుల ముందు నుంచి లైన్‌మెన్స్‌ ద్వారా నీటి వినియోగదారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 09 , 2025 | 06:38 AM