• Home » GHMC

GHMC

Commissioner RV Karnan: గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..

Commissioner RV Karnan: గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..

ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు.

HYD Heavy Rains: దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం

HYD Heavy Rains: దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్‌, మేడిపల్లి, ఉప్పల్‌, రామాంతపూర్‌, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

Hyderabad: కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..

Hyderabad: కాసేపట్లో భారీ వర్షం.. హైడ్రా హైఅలర్ట్..

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

GHMC: జీహెచ్‌ఎంసీలో జనరేటివ్‌-ఏఐ..

GHMC: జీహెచ్‌ఎంసీలో జనరేటివ్‌-ఏఐ..

పారదర్శక సేవలు, పౌర సమస్యల పరిష్కారం, పాలనా వ్యవహారాల్లో సంస్కరణలకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పౌర సేవలు మొదలు ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్‌ పార్కింగ్‌, బస్సుల రియల్‌ టైం ట్రాకింగ్‌, రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ మోడల్స్‌, ప్రాజెక్టు టెండర్‌ మూల్యాంకనం, కీటక జనిత వ్యాధుల నివారణ, నిర్మాణరంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌ నియంత్రణను సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని భావిస్తోంది.

Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం

Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి అల్పాహారం

ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి ఉదయం టిఫిన్‌ వడ్డించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.

GHMC: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్‌

GHMC: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్‌

హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) రాజేంద్రనగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కె.రవి కుమార్‌ శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

GHMC: వర్షమా.. అయితే మాకేం సంబంధం..

GHMC: వర్షమా.. అయితే మాకేం సంబంధం..

ఒక్క వాన.. నగరంలో వరద నీటి ప్రవాహ వ్యవస్థ డొల్లతనమే కాదు.. ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్నీ బహిర్గతం చేసింది. కుంభవృష్టితో మహానగర పౌరులు అవస్థలు పడుతున్నా.. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌తో తిప్పలు పడినా పట్టించుకున్న నాథుడు లేడు. అక్కడక్కడా మినహా అత్యవసర బృందాలు కనిపించలేదు.

Swachh Survekshan 2024-25: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌ ఘనత

Swachh Survekshan 2024-25: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌ ఘనత

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024లో 10 లక్షలకుపైగా జనాభా గల నగరాల కేటగిరీలో హైదరాబాద్‌ జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది.

GHMC: జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు..

GHMC: జీహెచ్‌ఎంసీలో మీడియాపై ఆంక్షలు..

జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే అంశంపై స్టాండింగ్‌ కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. యూట్యూబ్‌ చానళ్లు, డిజిటల్‌ పేపర్ల జర్నలిస్టులమని కార్యాలయానికి వస్తోన్న కొందరు అధికారుల విధినిర్వహణకు భంగం కలిగించడంతో పాటు.. బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తున్నారని పలువురు సభ్యులు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి