Share News

By-elections: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 07:43 AM

జూబ్లీహిల్స్‌ శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్‌ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు.

By-elections: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌(Jubilee Hills) శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్‌ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(GHMC Commissioner RV Karnan) సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రాథమిక సన్నాహాక సమావేశం నిర్వహించారు.


city3.2.jpg

ఎన్నికల సిబ్బంది, సామగ్రి సమకూర్చుకోవడం, ఈవీఎం, వీవీప్యాట్‌ రవాణా, శిక్షణ, కోడ్‌ అమలు, శాంతిభద్రతలు, జిల్లా సెక్యురిటీ ప్లాన్‌, పర్యవేక్షణ, మీడియా కమ్యూనికేషన్‌, ఫిర్యాదుల పరిష్కారం, లైవ్‌ వెబ్‌కాస్ట్‌, ఎస్‌ఎంఎస్‌ మానిటరింగ్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌, స్వీప్‌ కార్యకలాపాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది జాబితాలో జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఓటర్లు కాకుండా ఇతర ప్రాంతాల వారిని వినియోగించుకోవాలని సూచించారు.


city3.3.jpg

వారం రోజుల అనంతరం మరో సమావేశం ఉంటుందని, ఆ లోపు ఎన్నికల సన్నద్ధత తెలిపే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో రావాలని నోడల్‌ అధికారులతో కర్ణన్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఓటర్ల అవగాహన కోసం ఈవీఎం, వీవీ ప్యాట్‌లు సిద్ధం చేయాలని, ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద భారత ఎన్నికల సంఘం మార్గరద్శకాల ప్రకారం సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?

సిందూర్‌ తో మసూద్‌ కుటుంబం చిన్నాభిన్నం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 17 , 2025 | 07:43 AM