Hyderabad: నాలాలో గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు
ABN , Publish Date - Sep 17 , 2025 | 07:13 AM
మాంగార్ బస్తీ, ముషీరాబాద్ వినోభానగర్‌లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.
హైదరాబాద్ సిటీ: మాంగార్ బస్తీ, ముషీరాబాద్ వినోభానగర్(Mangar Basti, Musheerabad Vinobha Nagar)లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్‌ఎఫ్(Hydra DRF) బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు. ఘటనలు జరిగిన ప్రాంతాలు, పరిసరాల్లోని వరద నీటి కాలువల క్యాచ్‌పిట్ మూతలు తెరిచి చూస్తున్నారు.

మూసీ నదిలో మంగళవారం డ్రోన్ల ద్వారా పరిశీలన చేపట్టారు. ఇదిలా ఉండగా వినోభానగర్(Vinobhanagar) నాలాలో గల్లంతైన దినేష్ ద్విచక్ర వాహనాన్ని ఘటన జరిగిన 150 మీటర్ల దూరంలో గుర్తించారు. ఆసి్‌ఫనగర్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాలో గల్లంతైన అర్జున్, రాముల ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News