Home » GHMC
‘ఎంత చెప్పినా మీరు మారరా..? ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల విషయంలో ఇంత నిర్లక్ష్యమా..? టెండర్లు పూర్తయిన పనులూ ప్రారంభం కాలేదు. చెరువుల అభివృద్ధి, నాలాల విస్తరణ పనుల్లోనూ పురోగతి లేదు. పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు.
సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు హుస్సేన్ సాగర్‌కి వచ్చి చేరుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తూముల ద్వారా మూసీలోకి వరద నీటిని వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం.
హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ ప్లాట్లు వేలం వేస్తోందంటే జనం భారీగా పోటీ పడతారు. స్థలాలు నిమిషాల్లోనే అమ్ముడై.. సంస్థకు రూ.కోట్లు సమకూరతాయి. కానీ ఈసారి అలా జరగలేదు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు.
మాంగార్ బస్తీ, ముషీరాబాద్ వినోభానగర్‌లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.
వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్స్ పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడంపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్‌పుర, సోమాజిగూడ, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.