Home » Gas cylinder
పది నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లను ఇంటికి సరఫరా చేసేలా క్విక్ కామర్స్ సంస్థ ఇన్‌స్టామార్ట్‌తో హెచ్‌పీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కోసం ప్రత్యేకమైన నవ్య సిలిండర్‌లను ఆవిష్కరించింది. త్వరలో ఈ సేవలు బెంగళూరులో ప్రారంభం కానున్నాయి.
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో ప్రమాదం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.
జూన్ 30లోగా ఈకేవైసీ చేయించుకోని గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్ ఇతరత్రా వ్యాపారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్ధిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా ఈ నెలాఖరులోగా తమ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు ’వంట’ తంటాలు తెచ్చిపెట్టాయి. మూడు నెలలుగా కొత్తగా గ్యాస్ కనెక్షన్లు బంద్ అయ్యాయి.
దేశవ్యాప్తంగా సామాన్యుడిపై చమురు సంస్థలు మరోసారి ధరల భారాన్ని మోపాయి. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఒకేసారి రూ.29 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి..
సైబర్ నేరగాళ్లు ఎల్‌పీజీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతుండటంపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పందించాయి. వినియోగదరాలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశాయి.
తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్ విభాగం గ్యాస్ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట గ్యాస్ సిలిండర్లు పేలుతూ ప్రమాదాలు వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం.