Share News

సిలిం..డర్‌!

ABN , Publish Date - May 02 , 2026 | 12:55 AM

నిన్న మొన్నటి వరకు గృహ విని యోగదారులకు అందించే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఎదురైన ఇబ్బందులు కాస్తా తీరాయనుకుంటే వాణిజ్య గ్యాస్‌ వినియోగదారులపై (కమర్షియల్‌ గ్యాస్‌) పెనుభారం పడిం ది.

సిలిం..డర్‌!

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

నిన్న మొన్నటి వరకు గృహ విని యోగదారులకు అందించే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఎదురైన ఇబ్బందులు కాస్తా తీరాయనుకుంటే వాణిజ్య గ్యాస్‌ వినియోగదారులపై (కమర్షియల్‌ గ్యాస్‌) పెనుభారం పడిం ది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.993 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈపెంపుతో జిల్లా లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.3,170 లకు చేరింది. జిల్లాలో వెయ్యి వరకు వాణిజ్య గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా లో ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు అవసరం మేరకు సరఫరా అవుతున్నాయి. మిగిలి న వాణిజ్య గ్యాస్‌ వినియోగదారులకు అంతంత మాత్రంగానే సరఫరా అవుతున్నాయని చెబుతున్నారు.

జిల్లాలో హోటళ్లలో 70 నుంచి 80 శాతం వరకు వాణిజ్య గ్యాస్‌ సిలిం డర్లను వినియోగిస్తుంటారు. అయితే పశ్చిమ ఆసియాలో ఇరాన్‌– ఇజ్రాయిల్‌– అమెరికా యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ సర ఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం ప్రధానంగా వాణిజ్య గ్యాస్‌ వినియోగ దారులపై పడింది. అప్పటినుంచి హోట ళ్లకు వాణిజ్య గ్యాస్‌ సరఫరా కొంతకాలం నిలిపివేశారు. దీంతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలు చెల్లించి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా 40 శాతం మాత్రమే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని గ్యాస్‌ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధర పెంచి కేంద్రం పెనుభారం మోపిం దని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికే గ్యాస్‌ కొరతతో హోటళ్లలో టిఫిన్స్‌, భోజనాల ధరలు పెంచేశారు. గ్యాస్‌ ధర పెంపుతో వీటి ఽధలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

Updated Date - May 02 , 2026 | 12:55 AM