Share News

కదిరి ప్రమాద ఘటనపై స్పందించిన హోం మంత్రి

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:03 PM

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కదిరి ప్రమాద ఘటనపై స్పందించిన హోం మంత్రి
home minister Anitha response

అమరావతి, ఏప్రిల్ 15: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు.


శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీతో ఫోన్లో మాట్లాడి.. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

జగన్ పాదం పడితే సముద్రం కూడా విషపూరితం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

తండ్రికి తగ్గ తనయుడు.. లోకేశ్‌కు హార్దిక శుభాకాంక్షలు: మంత్రి నారాయణ

Updated Date - Apr 15 , 2026 | 04:32 PM