కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:12 PM
సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
సత్యసాయి జిల్లా: కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ పేలుడు ఘటనపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులకు మంత్రి సవిత హుకుం జారీ చేశారు. ఈ ఘటన వెనుక ఏవైనా అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గాయపడిన వారికి ఉత్తమ చికిత్స అందిస్తామని, బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
అలాగే ఆస్తి నష్టంపైనా పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు మంత్రి సవిత. ఇళ్లలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరమని, అది చట్టరీత్యా నేరమని ఆమె హెచ్చరించారు. అయితే, డిటోనేటర్లు, అమ్మోనియం సల్ఫేట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వెంకన్న, సంపత్ కుటుంబం డిటోనేటర్ల సహాయంతో కొండల్లో రాళ్లను పగలకొట్టి అమ్ముకుంటున్నారు. వీటిని ఇంట్లో పెట్టడంతో ప్రమాదం జరిగి ఐదుగురు మృతిచెందారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత: పల్లా శ్రీనివాస్ రావు
ఆకివీడు రామాలయానికి రూ.కోటి విరాళం: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ