Share News

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత: పల్లా శ్రీనివాస్ రావు

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:52 PM

నమ్మకంతో బీసీని అయిన తనకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత: పల్లా శ్రీనివాస్ రావు
Palla Srinivas Rao

అమరావతి, ఏప్రిల్ 15: తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivas Rao) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు, బీసీలకు రాజకీయంగా అండగా నిలబడటం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పారు. నమ్మకంతో బీసీని అయిన తనకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు(CM Chandrababu) పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తల సంక్షేమం, సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, యువతను ప్రోత్సహిస్తూ పార్టీని భవిష్యత్తు తరాలకు ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.


పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కార్యకర్తల ఆశల ఆశాకిరణం నారా లోకేశ్‌కు పల్లా శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. సామాన్య మండల అధ్యక్షురాలిని, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లను పార్టీలో అత్యున్నత కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం హర్షణీయమని శ్రీనివాస్ రావు అన్నారు. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ‘మీరు చేపట్టబోయే ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

యువనేత కృషి.. పూర్తి న్యూ లుక్‌తో టీడీపీ కమిటీలు

విషాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 04:58 PM