Share News

పారిశ్రామిక రంగానికి భారీ ఊరట: బల్క్ ఎల్‌పీజీ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

ABN , Publish Date - Apr 08 , 2026 | 02:40 PM

దేశంలోని పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫార్మా, స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఇంధన కొరత అధిగమించేందుకు బల్క్ నాన్-డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కేటాయింపులను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

పారిశ్రామిక రంగానికి భారీ ఊరట: బల్క్ ఎల్‌పీజీ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
India LPG Supply Increase

న్యూఢిల్లీ: దేశంలోని పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫార్మా, ఫుడ్, పాలిమర్, స్టీల్, గ్లాస్ వంటి పలు పారిశ్రామిక రంగాలకు ఇంధన కొరత అధిగమించేందుకు బల్క్ నాన్-డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కేటాయింపులను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక యూనిట్లకు ఇధన అవసరాలు పెరగడమే కాకుండా, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక యూనిట్లకు గత మార్చి నెల నాటి వినియోగంతో పోలిస్తే 70 శాతం ఎల్‌పీజీ సరఫరాను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాల కోసం రోజుకు గరిష్ఠంగా 0.2 TMT వరకు గ్యాస్ కేటాయింపులు జరగనున్నాయి. సహజ వాయువు లభ్యం కాని లేదా ప్రత్యామ్నాయంగా వాడలేని సున్నితమైన పారిశ్రామిక ప్రక్రియలకు ఈ కేటాయింపుల్లో అగ్రతాంబూలం దక్కనుంది.


పీఎన్‌జీ (PNG) సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసే రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అటువంటి రాష్ట్రాలకు అదనంగా 10శాతం వరకు ఎల్‌పీజీ కేటాయింపులు పెంచనున్నారు. అలాగే, కంప్రెస్ట్ బయో గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి త్వరితగతిన రాష్ట్ర సీబీజీ పాలసీని నోటీఫై చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ అదనపు కేటాయింపులు పొందాలనుకునే పారిశ్రామిక యూనిట్లు తప్పనిసరిగా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మందుబాబులకు చేదు వార్త.. మూడు రోజులు షాపులు బంద్

కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 04:05 PM