మందుబాబులకు చేదు వార్త.. మూడు రోజులు షాపులు బంద్
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:23 PM
శాసనసభ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
21 నుంచి టాస్మాక్ దుకాణాలకు 3 రోజులు సెలవు
చెన్నై: శాసనసభ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల పోలింగ్ జరగటానికి ముందుగా రెండు రోజులపాటు, పోలింగ్ రోజున టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు మద్యం దుకాణాలనూ మూసివేస్తామని పేర్కొన్నారు. ఇదే విధంగా పోలింగ్ జరుగనున్న మే నెల 4న కూడా మద్యం దుకాణాలు మూతపడతాయని ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం
Read Latest Telangana News and National News