మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:09 PM
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 8: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఈరోజు(బుధవారం) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పలు విభాగాలను తనిఖీ చేసిన మంత్రి.. సిబ్బంది అటెండెన్స్‌ను పరిశీలించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది ఆఫీస్‌కు వచ్చినా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయని పరిస్థితి. దీంతో సంతకాలు చేయని వాళ్ల పేర్లు చదివి.. వారి చేత స్వయంగా సంతకాలు చేయించారు కొల్లు రవీంద్ర.
మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది బాధ్యరాహిత్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అని సిబ్బందిని ప్రశ్నించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి
అమరావతి పనులపై సమీక్ష.. మంత్రి నారాయణ ఆదేశాలివే
Read Latest AP News And Telugu News