బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Apr 08 , 2026 | 09:28 AM
సూర్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.
సూర్యాపేట, ఏప్రిల్ 8: సూర్యాపేట జిల్లాలో ఈరోజు(బుధవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బొలెరో వాహనాన్ని వెనక నుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన జనిగ సతీష్, నరసింహారావుగా గుర్తించారు.
వీరంతా దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అందరూ కలిసి గుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
కేరళం ఎన్నికలు.. 2011 ఫలితాలు రిపీట్ అవుతాయా?
Read Latest Telangana News And Telugu News