Share News

ఎన్నికల నిర్వహణకు రూ.1,302 కోట్లు

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:31 AM

రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం రూ.1,302కోట్ల కేటాయించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు రూ.1,302 కోట్లు

  • ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌

చెన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం రూ.1,302కోట్ల కేటాయించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ తెలిపారు. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అర్చనా పట్నాయక్‌ సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం ఎన్నికల సన్నాహాలపై మీడియాకు వివరించారు. అసెంబ్లీలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు.


సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 5,938 పోలింగ్‌ కేంద్రాలు, అలాగే 3,302 ప్రాంతాల్లో పోలీస్‌ భద్రత పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తిచేసేందుకు రూ.1,302 కోట్లు కేటాయించామని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.975కోట్లు, అదేవిధంగా 2024 పార్లమెంట్‌ ఎన్నికలకు రూ.1,009కోట్లు కేటాయించినట్లు ఆమె వివరించారు.


zzz.jpgఅసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నెల 13వ తేదీలోగా పారా మిలిటరీ బలగాలు రాష్ట్రానికి వస్తాయన్నారు. ఇప్పటి వరకు 85యేళ్లకు పైబడిన 2.5లక్షల మంది సీనియర్‌ సిటీజన్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారని అర్చనా పట్నాయక్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బూతు నేతల రోత గోల!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 11:31 AM